శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా చాలా గ్యాప్ తర్వాత గత ఏడాది ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ 2025 డిసెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాపై రోషన్ భారీ ఆశలే పెట్టుకున్నా కూడా ప్రేక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందనలే దక్కాయి. కాకపోతే ఈ మూవీ లో రోషన్ యాక్షన్ కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి. గత సినిమాలతో పోలిస్తే ఇందులో రోషన్ నటనలో మరింత ఈజ్ చూపించాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఛాంపియన్ మూవీ లో రోషన్ కు జోడిగా అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. జనవరి 29 ఈ మూవీ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది అని తెలిపారు. ఫుట్ బాల్ గేమ్ ను ఎంతో ఇష్టపడే యువకుడు అనుకోకుండా బైరాన్ పల్లి గ్రామంలోకి వెళ్లి అక్కడ ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి అన్నదే ఈ మూవీ. ఈ మూవీ లో రోషన్ కు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అనే చెప్పాలి. ఇప్పుడు ఓటిటి లో ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.