కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాం

Update: 2019-10-01 09:18 GMT

ఏపీలో ఈ మధ్య కాలంలో ఎవరూ ఎదుర్కోనన్ని విమర్శలు కోడెల శివరాం ఎదుర్కొన్నారు. కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్న సమయంలో ఆయన తనయుడైన శివరాం సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పలు వర్గాల ప్రజలను బెదిరించి కె ట్యాక్స్ వసూలు చేశారని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు సొంత పార్టీ నేతలు కూడా వీళ్ళకు ఎదురుతిరిగే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో అధికార మార్పిడి తర్వాత కోడెల శివరాంపై వరస పెట్టి కేసులు నమోదు అయ్యాయి.

అదే సమయంలో కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. దీంతో కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. ఐదు కేసుల విషయమై తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోడెల శివరాం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా సూచించింది. ఈ క్రమంలో కోడెల శివరాం మంగళవారం నాడు నరసరావుపేట ఫస్ట్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయారు.

 

 

Similar News