తెలుగు సీఎంల ఢిల్లీ టూర్

Update: 2019-10-02 16:31 GMT

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సడన్ గా ఢిల్లీ టూర్లు ఖరారు అయ్యాయి. తెలంగాణ సీఎం కెసీఆర్ గురువారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీతో ఆయన సమావేశం ఫిక్స్ అయింది. కేంద్రంలో మోడీ రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఇంత వరకూ వీరిద్దరి భేటీ జరగలేదు. పైగా రాజకీయంగా తెలంగాణలో బిజెపి దూకుడు పెంచింది. కెసీఆర్ కూడా బిజెపిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో కెసీఆర్, మోడీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలతోపాటు..సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరనున్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కెసీఆర్ ఢిల్లీ టూర్ ఫిక్స్ అయిందని వార్తలు వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ వార్త కూడా వచ్చింది. జగన్ ఈ నెల5 ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. ఆయన కూడా ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. ఇద్దరు సీఎంలకు ప్రధాని మోడీ అకస్మాత్తుగా అపాయింట్ మెంట్లు ఇవ్వటం వెనక మతలబు ఏమిటి? అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ గతంలో పలుమార్లు మోడీతో భేటీ అయ్యారు. కెసీఆర్ మాత్రం ఇదే తొలిసారి. అయితే ఏపీలో అక్టోబర్ 15నుంచి ప్రారంభం కానున్న రైతు భరోసా యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్రమోడీని ఏపీ సీఎం జగన్ ఆహ్వానించనున్నారు.

 

 

Similar News