ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరు..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Update: 2019-10-18 09:50 GMT

ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన తెలంగాణణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసికి మరింత మంది మద్దతు ఇస్తే పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తాము చెప్పినా ఎందుకు ఆర్టీసీ ఎండీని నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ ఎండీ నియామకం వల్ల సమస్య పరిష్కారం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఇన్ ఛార్జిగా ఉన్న అధికారి సమర్ధుడని తెలిపింది. మరి అంత సమర్ధుడైన అధికారి ఉంటే రెండు వారాలుగా సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. కొత్తగా ఆర్టీసీ ఎండీని నియమించటం వల్ల సర్కారుపై ఏమైనా అదనపు భారం పడుతుందా అని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యంత శక్తివంతులు అని ..వారు తిరగబడితే ఎవరూ ఆపలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. రెండు వారాలుగా ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. వాళ్ళ ఆందోళనలను ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. శనివారం నాటి బంద్ కు టీఎన్జీవోలతోపాటు ప్రైవేట్ క్యాబ్స్ యూనియన్ కూడా మద్దతు పలికిందని..ప్రభుత్వం వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారని ప్రశ్నించింది. ఆర్టీసి కార్మికులు లేవనెత్తిన వాటిలో ఎక్కువ డిమాండ్లు పరిష్కరించదగ్గవే అని కోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని కోర్టుకు సర్కారు నివేదించింది. ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది.

 

Similar News