సామజవరగమన సాంగ్ అల..వైకుంఠపురములో సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ఇఫ్పటికీ ఈ పాట యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా చిత్ర యూనిట్ కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మరో హీరో సుశాంత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో సుశాంత్ పాత్ర పేరు రాజ్ గా వెల్లడించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో సహజంగా అల్లు అర్జున్ అభిమానుల్లో భారీ ఆశలే ఉంటాయి.
దీనికి తోడు సామజవరగమన సాంగ్ క్రియేట్ చేసిన హైప్ మామూలుగా లేదు. అల..వైకుంఠపురములో పూజా హెగ్డెతోపాటు నివేది పేతురాజ్ కూడా నటిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్ చేయనుందని సమాచారం. దీంతో పాటు సినిమాకు సంబంధించిన రాములో..రాములా పాట టీజర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. హుషారుగ చిందేస్తూ అల్లు అర్జున్ ఆకట్టుకుంటున్నారు.