పోలవరంపై సుజనా సంచలన వ్యాఖ్యలు

Update: 2019-09-11 14:33 GMT

జగన్ సర్కారుపై కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ 500 కోట్ల రూపాయలు కాదు కదా..ఐదు రూపాయలు కూడా ఆదా చేయలేరని వ్యాఖ్యానించారు. ఎవరైనా అవినీతి చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి కానీ..ప్రాజెక్టులు అన్నింటిని ఆపటం సరికాదని విమర్శించారు. ప్రజా సమస్యలను వదిలేసి..రాజకీయ కక్షలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు కన్పిస్తోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం అయ్యే కొద్ది ఏటా 20 వేల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులు నస్టపోయే అవకాశం ఉందన్నారు.

అమరావతి విషయంలో జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స చేసిన ప్రకటనతో రైతులు గందరగోళంలో ఉన్నారని అన్నారు. మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరని అన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదని తెలిపారు.

 

Similar News