పీపీఏలపై జగన్ సర్కారుకు ఊరట

Update: 2019-09-24 08:28 GMT

సంప్రదాయేతర విద్యుత్ సంస్థల విద్యుత్ ఒప్పందాలు అన్నింటిని సమీక్షించేందుకు ఉద్దేశించి జారీ చేసిన జీవో 63ని హైకోర్టు కొట్టివేసింది. అయితే విద్యుత్ సంస్థలు అన్నీ పీపీఏలకు సంబంధించి తమ వాదనలు ఏపీఈఆర్ సీ ముందు విన్పించాల్సి ఉంటుంది. అసలు తమ ఒప్పందాలు సమీక్షకు ఛాన్సేలేదంటూ పేర్కొన్న కంపెనీల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. పీపీఏల పునఃసమీక్షకోసం ఏపీఈఆర్‌సీకి వెళ్తామంటూ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు ఓకే చెప్పింది. ఇకపై పీపీఏల పునఃసమీక్షకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్‌సీ ఎదుటే వినిపించాలని హైకోర్టు సూచించింది.

ఏపీఈఆర్‌సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ధారించలేమని హైకోర్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఏపీఈఆర్‌సీకి స్పష్టం చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుకింద యూనిట్‌కు రూ. 2.43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చట్టంప్రకారం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయవచ్చని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను తిరిగి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

 

 

 

 

Similar News