టీటీడీలో నగలు గల్లంతు..కలకలం

Update: 2019-08-27 06:06 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భద్రతా డొల్లతనం ప్రతి సందర్భంలోనూ బట్టబయలు అవుతోంది. ఏకంగా స్వామివారికి వచ్చిన నగలు గల్లంతు అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. గుర్తించినవి కొన్నే...మరి గుర్తించని ఎన్నో. గత కొంత కాలంగా టీటీడీలో నగలకు సంబంధించి వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా ట్రెజరీలో ఉన్న 5.4 కిలోల వెండి కిరీటం, 2 ఉంగరాలు, గోల్డ్‌ చైన్‌ చోరీకి గురైనట్టు నిర్ధారించారు. దర్యాప్తు చేపట్టిన టీటీడీ అధికారులు ఏఈవో శ్రీనివాసులును బాధ్యుడిగా తేల్చారు.

అతనిపై టీటీడీ చర్యలు ఉపక్రమించింది. అతని వేతనాల నుంచి రికవరి పెట్టినట్లు చెబుతున్నారు. అయితే ఈ నగల తస్కరణ ఎప్పుడు జరిగింది అన్నది తేలాల్సి ఉంది. వెంకటేశ్వరస్వామికి వచ్చిన నగలను దొంగిలించిన వ్యక్తిని బాధ్యతల నుంచి తప్పించకుండా నగదు రికవరి చేయటం ఏమిటనే విమర్శలు విన్పిస్తున్నాయి. అసలు తప్పుచేసిన వ్యక్తి నుంచి కేవలం రికవరికి సిఫారసు చేసింది ఎవరు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

 

Similar News