విజయదేవరకొండతో జాన్వి!

Update: 2019-08-18 06:48 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సెన్సేషనల్ స్టార్ విజయదేవరకొండతో శ్రీదేవి కూతురు జాన్వీ జోడి కట్టబోతుందా?. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వీళ్ళిద్దరూ కలిస్తే ఆ సినిమా క్రేజ్ ఓ రేంజ్ కు వెళ్ళటం ఖాయం. పూరీ జగన్నాథ్ తో తాజాగా విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఛార్మి ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే. మగ్గురూ కలసి ఉన్న ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. వీళ్ళ సినిమాలోకి జాన్విని తెచ్చేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు టాక్.

అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదే నిజం అయితే జాన్వి కోరిక కూడా తీరనుంది. టాలీవుడ్ లో తన అభిమాన హీరో విజయదేవరకొండ అని కొద్ది రోజుల క్రితం జాన్వి ప్రకటించింది. ఛాన్స్ వస్తే ఆయనతో నటిస్తానని కూడా తేల్చిచెప్పింది. ఇప్పుడు అదే నిజం అవుతున్నట్లు కన్పిస్తోంది. చాలా కాలం తర్వాత పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ మూవీతో కమర్షియల్ హిట్ అందుకున్నారు. అదే జోష్ లో విజయ్ తో సినిమాకు రెడీ అయ్యారు పూరీ అండ్ ఛార్మి.

 

Similar News