చింతమడక ప్రజలు చేసిందేమిటి?

Update: 2019-07-31 16:27 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చింతమడక ప్రజలు ఏమి త్యాగం చేశారని ఆ గ్రామంలోని కుటుంబాలకు సీఎం కెసీఆర్ పది లక్షల రూపాయల సాయం ప్రకటించారని ప్రశ్నించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులు ఏమి పాపం చేశారని అన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులు ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కెటీఆర్ వారి సమస్యలు పరిష్కరించటంలో విఫలమయ్యారని ఆరోపించారు.

రైతులకు ఎందుకు వారికి పరిహారం ఇవ్వటంలేదని ప్రశ్నించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులైన పదకొండు గ్రామాల ప్రజలతో జీవన్ రెడ్డి అఖిలపక్ష నేతలు పాదయాత్ర చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యమ సమయంలో భూనిర్వాసితుల తరపున పోరాడిన కెసీఆర్ అధికారంలోకి వచ్చాక మాత్రం వారి సమస్యలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు.

Similar News