అబద్దాలు మా ఇంటా వంటా లేదు

Update: 2019-07-23 04:50 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీల అంశంపై సభలో రగడ ప్రారంభం అయింది. సభను ప్రతిపక్ష టీడీపీ తప్పుదారి పట్టిస్తోందని సీఎం జగన్ విమర్శించారు. ఈ వీడియో చూసిన తర్వాత అయిన తర్వాత అయినా టీడీపీ సభకు క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. తాను ఎన్నికల ప్రచార సమయంలో ఏమి హామీ ఇచ్చానో చూడండి అంటూ అసెంబ్లీలో రెండుసార్లు ఓ వీడియోను ప్రదర్శించి చూపారు. తమ మేనిఫెస్టోను ప్రజలకు చూపించామని.. అది చూసే ప్రజలు తమకు ఓట్లు వేశారని తెలిపారు. తమ మేనిఫెస్టో చూసి ప్రజలు ఓట్లు వేసినందుకు గర్వంగా ఉందన్నారు.

టీడీపీ సభ్యులకు మరింత క్లారిటీ కావాలంటే తాను ప్రజాసంకల్పయాత్రలో ఏం మాట్లాడాలో వినాలని సూచించారు. టీడీపీ ఆరోపణలపై తొలుత స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి.. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ. 75 వేల ఇస్తామన్నా విషయాన్ని గుర్తుచేశారు. తమ మేనిఫెస్టోలో కూడా ఇదే విషయాన్ని చెప్పామని అన్నారు. చంద్రబాబులా మోసం చేసే అలవాటు తమకు లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ప్రతిపక్ష నేత చంద్రబాబుది కపట ప్రేమ అని మండిపడ్డారు. టీడీపీ ఎవో పాత పేపర్లు పెట్టి రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.

Similar News