వివాదంలో చిరంజీవి సినిమా ‘సైరా’

Update: 2019-06-30 11:05 GMT

భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా’ వివాదంలో పడిందా?. పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నట్లు కన్పిస్తున్నాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహరెడ్డి చరిత్రతో రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా నరసింహరెడ్డి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ సినిమా కథ మొత్తం తీసుకుని తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని..ఇప్పుడు తమను కనీసం కలవటానికి అవకాశం ఇవ్వటంలేదని ఆరోపిస్తూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యలు ఆందోళనకు దిగారు.

రామ్ చరణ్ ఆఫీస్ ముందుకు వీరు ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై మరి రామ్ చరణ్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సైరా సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఇతర కీలక పాత్రల్లో అమితాబచ్చన్, జగపతిబాబు, అనుష్క, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Similar News