విజయవాడలో వర్మను అడ్డుకున్న పోలీసులు

Update: 2019-04-28 08:57 GMT

విజయవాడలో నడిరోడ్డు మీద విలేకరుల సమావేశం పెట్టాలని ప్రయత్నించిన వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నాలు ఫలించలేదు. విజయవాడలో నోవాటెల్ తోపాటు పలు హోటళ్ళలో వర్మ విలేకరుల సమావేశానికి అనుమతి లభించలేదు. దీంతో ఆయన రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆ మేరకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన్ను అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోకి ప్రవేశించకుండా..మళ్ళీ తిరిగి విమానాశ్రయంలోనే వదిలిపెట్టారు. తదుపరి విమానంలో వర్మను హైదరాబాద్ పంపే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.

వర్మ బహిరంగంగా ప్రెస్ మీట్ పెడితే తెలుగుదేశం అభిమానులు, సానుభూతిపరులు అక్కడికి వచ్చి ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు వర్మను అడ్డుకున్నారు. ఆయన తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మే1న ఏపీలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి మాట్లాడటానికే వర్మ విజయవాడలో విలేకరుల సమావేశం తలపెట్టారు. శాంతి భద్రత ల దృష్టిలో ఉంచుకుని ఎటువంటి మీడియా సమావేశాలు కు అనుమతి లేదని పోలీసులు రాంగోపాల్ వర్మ కి సూచించారు.

 

Similar News