జయరాం హత్య కేసులో అరెస్ట్

Update: 2019-02-03 15:38 GMT

ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక పురోగతి. ఈ హత్యకు సంబంధించి పోలీసులు రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ హత్య కేసులో గుట్టువీడినట్లు అయిందని భావిస్తున్నారు. నాలుగురోజుల క్రితం జరిగిన కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై జయరాం (55) హత్య జరిగిన విషయం తెలిసిందే. రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్‌ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. జయరాం, రాకేష్‌ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

హత్యను ప్రమాదంగా చిత్రీకరిచేందుకు రాకేష్‌ యత్నించాడని తెలిపారు. రాకేష్‌కు సహకరించిందెవరో తేలాల్సి ఉందని అన్నారు. ఈకేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిగురుపాటి జయరాం భార్యాపిల్లలు ఆమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. జయరాం మృతదేహాన్ని జూబ్లిహిల్స్‌ లోని ఆయన నివాసానికి తరలించారు. జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు ఆయన భార్య స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. పోలీసుల విచారణలో శిఖా చౌదరి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

Similar News