చంద్రబాబు దీక్షకు 1.12 కోట్లతో ప్రత్యేక రైళ్ళు

Update: 2019-02-08 10:28 GMT

కేంద్రం నుంచి రాష్ట్రాల హక్కులను సాధించటం కోసం ముఖ్యమంత్రి దీక్ష చేయాలనుకుంటే చేయవచ్చు. ఆయన..ఆయనకు తోడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..పార్టీ నేతలు వెళితే సరిపోతుంది. కానీ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు పెట్టి ప్రత్యేక రైళ్లు బుక్ చేసి..ప్రజలను తరలించాల్సిన అవసరం ఏముంది?. ఢిల్లీలో చంద్రబాబు చేసేది దీక్షా?. లేక బలప్రదర్శనా?. ఇది ఓ రకమైన నిరసన ప్రదర్శన లాంటిది. మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి సాధించలేనిది ఒక్క రోజు దీక్షతో ఫలితం వస్తుందా?.

అది కూడా ఈ నెలాఖరులోపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో. దీక్ష చేసేది రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నది సుస్పష్టం. అందుకు ప్రజల సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది?. రైళ్ళ బుకింగ్ కోసం ఏకంగా 1.12 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. ఇదొక్కటే కాదు...ఇంకా భారీ మొత్తంలో చంద్రబాబు దీక్ష కోసం ఖర్చు చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

Similar News