కెఈ కి మరో అవమానం

Update: 2019-01-31 06:31 GMT

ఏపీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత కె ఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం. అమరావతిలో అట్టహాసంగా నిర్మించనునున్న వెంకటేశ్వరస్వామి దేవాలయం పనులు గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి సాక్ష్యాత్తూ దేవాదాయ శాఖ బాధ్యతలు చూస్తున్న కె ఈ కృష్ణమూర్తికి ఆహ్వానం కూడా అందలేదు. ఇదేమి పట్టించుకోకుండానే చంద్రబాబు మాత్రం తన పని తాను కానిచ్చేశారు. సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన కె ఈ కృష్ణమూర్తిని టీటీడీ అధికారులు విస్మరించారు. ఈ పరిణామంపై కె ఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే టీటీడీ ఆలయం ప్రారంభిస్తారా? అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ చంద్రబాబు సర్కారు పలుమార్లు కెఈ కృష్ణమూర్తిని అవమానాల పాలు చేసింది. ఆయన ఒక్కరికే కాదు..ఇలాంటి పరిస్థితి మరో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కూడా ఎదురైంది. ఆయన శాఖకు చెందిన భవనం ప్రారంభోత్సవానికి కనీసం మంత్రిని పిలవకుండానే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. అప్పట్లో శాఖ మంత్రి అయిన చినరాజప్పను వదిలేసి...మరో మంత్రి నారాయణను మాత్రం పిలిచారు.

Similar News