అమరావతిలో ‘ఐకానిక్ వంతెన’కు శంకుస్థాపన

Update: 2019-01-12 11:30 GMT

ఎట్టకేలకు అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన ‘ఐకానిక్’ వంతెనకు మార్గం సుమగం అయింది. ఈ ప్రాజెక్టు డిజైన్లు ఎప్పుడో పూర్తయి..టెండర్ ఎల్ అండ్ టికి దక్కినా పనులు ప్రారంభించటంతో విపరీత జాప్యం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడే ఈ ఐకానిక్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ బ్రిడ్జి పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి చేయనుంది. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం దగ్గర నుంచి అమరావతి వరకూ కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మిస్తున్నారు.

అయితే ఇది కేవలం వంతెనగా కాకుండా ఓ ఐకానిక్ నిర్మాణంలా ఉండటంతో పర్యాటకులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దాలన్నది సర్కారు ఆలోచన. అందుకు అనుగుణంగా ఈ బ్రిడ్జి డిజైన్ ను సిద్ధం చేశారు. ఈ బ్రిడ్జితో హైదరాబాద్, జగదల్ పూర్ జాతీయ రహదారులు అమరావతితో కనెక్టివిటి పొందుతాయి. ఈ బ్రిడ్జి పూర్తయితే విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గనుంది.

Similar News