‘భారతీయుడు2’ ఫస్ట్ లుక్ విడుదల

Update: 2019-01-15 04:56 GMT

భారతీయుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కథతో పాటు పాటలు కూడా అద్భుతంగా ఉండటంతో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లోనే భారతీయుడు 2 వస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ కాజల్ నటిస్తోంది.

సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పస్ట్‌ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్‌ లుక్ చూసిన వారికి భారతీయుడు సినిమా పాత జ్ణాపకాలు గుర్తుకు రావటం ఖాయం. మరోసారి భారతీయుడు 2 ఎంత సంచలనం సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే.

 

 

Similar News