తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆంధ్రాలో యాడ్స్ ఇవ్వొచ్చా?

Update: 2018-12-30 02:41 GMT

‘తెలంగాణ పత్రికల్లో ఆంధ్రా వార్తలు ఎందుకు?.’ ఇదీ తెలంగాణ సీఎం కెసీఆర్ మాట. మరి తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆంధ్రా ఎడిషన్లలో అదే ఆంధ్రా పత్రికలకు యాడ్స్ ఇవ్చొచ్చా?. రైతు బంధు, రైతు భీమా పథకాలకు సంబంధించి విస్తృతంగా పేజీలకు పేజీలు ప్రకటనలు ఇఛ్చారు. ఒక్క ఆంధ్రాలోనే కాదు..దేశంలోనే అన్ని ప్రాంతీయ, జాతీయ పత్రికలకు కెసీఆర్ తన పథకాలతో ఫుల్ పేజీ ప్రకటనలో ప్రచారం నిర్వహించుకున్నారు. అది ఆయన ఇష్టం. ఈ పథకాల గురించి తెలియాల్సింది అనుభవదారులైన తెలంగాణ ప్రజలకు. వాళ్ళు ఎలాగూ అనుభవదారులే కాబట్టి వాళ్ళకు అసలు ప్రకటనలే అవసరం లేదు. ఏ ప్రభుత్వం అయినా చేసింది తప్పు కాబట్టి ప్రకటన ఇవ్వటం కూడా తప్పేమీ కాదు. కాకపోతే కెసీఆర్ శనివారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలే వివాదస్పదం. ఓ ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతగా మీడియాపై అభ్యంతరాలు ఉంటే చెప్పటాన్ని కూడా ఎవరూ ప్రశ్నించరు.

ఇదే తరహాలో రాబోయే రోజుల్లో కెసీఆర్ తనకు నచ్చకపోతే పత్రికల్లో జాతీయ వార్తలు..అంతర్జాతీయ వార్తలు..సినిమా వార్తలు కూడా వద్దు అని చెబుతారా?. ఏ పత్రికల్లో ఎలాంటి వార్తలు వేయాలో వేయకూడదో అది పత్రికలు చూసుకుంటాయి. ఆ పత్రికల్లో వచ్చే వార్తలు నచ్చకపోతే ప్రజలే పత్రికలను మార్చుకుంటారు. అంతే కానీ ఓ ముఖ్యమంత్రి పలానా పత్రికలో పలాన వార్తలే రావాలి అని డిసైడ్ చేస్తారా?. ఇప్పుడు కెసీఆర్ టార్గెట్ చేసిన పత్రికలను గత తన నాలుగున్నర సంవత్సరాల పాలనలో అక్కున చేర్చుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయారా?. కెసీఆర్ చెబుతున్న లాజిక్ ప్రకారం చూస్తే తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి అసలు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఏమి అవసరం?

 

 

 

 

 

Similar News