ఏపీకి ఇద్దరు కొత్త మంత్రులు

Update: 2018-11-11 08:12 GMT

అదుగో..ఇదుగో అంటూ విపరీత జాప్యం జరిగిన ఏపీ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. వాస్తవానికి బిజెపికి చెందిన నేతలు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన వెంటనే విస్తరణ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ రకరకాల కారణాలతో అది జాప్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ ఆదివారం నాడు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన మంత్రులుగా ఎన్ ఎం డీ ఫరూక్‌, కిడారి శ్రవణ్‌ లు ప్రమాణ స్వీకారం చేశారు.

గవర్నర్ నరసింహన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఫరూక్‌, శ్రవణ్‌లను మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను గవర్నర్‌ ఆమోదించారు. కిడారి శ్రవణ్‌ కు గిరిజన సంక్షేమశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, మైనార్టీ వెల్ఫేర్‌ శాఖలు ఎన్ ఎండీ ఫరూక్‌ కు కేటాయించారు. ఫరూక్ తెలుగులో ప్రమాణం చేయగా, శ్రవణ్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.

Similar News