రజనీకాంత్ సినిమా 2.ఓ విడుదలకు రంగం సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త స్టిల్స్ ను విడుదల చేసింది. ఇవి సోషల్ మీడియాలో ఇప్పుడు అదరగొడుతున్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ హాలీవుడ్ స్థాయిలో సృషించిన ఈ విజువల్ వండర్ ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్షయ్‌కుమార్ నెగటీవ్ రోల్లో నటిస్టున్న ఈ చిత్రంలో రజనీకాంత్ కు జోడీగా అమీజాక్సన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో టీజర్, ట్రైలర్ రూపంలో చిత్ర యునిట్ అభిమానులకు రుచి చూపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి చిత్ర బృందం సినిమాకు సంబంధించిన స్టిల్స్ ను షేర్ చేసింది.