తెలంగాణలో డిసెంబర్7న ఎన్నికలు..ఫలితాలు11న

Update: 2018-10-06 10:09 GMT

అత్యంత ఉత్కంఠ రేపిన తెలంగాణ ఎన్నికల తేదీలు వచ్చేశాయి. ఒకే దశలో తెలంగాణ రాష్ట్రమంతటా 119 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 7న పోలింగ్ ఉంటుంది. ఫలితాలు డిసెంబర్ 11న రానున్నాయి. ఓ వైపు ఓటర్ల జాబితాపై కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల తేదీలను ప్రకటించటం విశేషం. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయనే అంశంతో పాటు ఫలితాలు ఎప్పుడు వెలువరించేది కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) ఓ పీ రావత్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 8 నుంచి 12వ తేదీకి పెంచారు.

ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల ప్రకటనకు కొంత సమయం పట్టవచ్చని చెప్పిన రావత్..ఆ తర్వాత కొద్దిసేపటికే ఎన్నికల తేదీతోపాటు...పలితాల వెల్లడి తేదీ ప్రకటించటం కలకలం రేపుతోంది. తెలంగాణలో నవంబర్ 12న నోటిఫికేషన్ వస్తుందని..19వ తేదీ నామినేషన్ల చివరి తేదీగా పేర్కొన్నారు. 20వ తేదీని స్క్రూటినీ జరగనుంది. 22న విత్ డ్రాయల్స్, డిసెంబర్ 7న ఎన్నికలు..11న కౌంటింగ్ జరగనుందని తెలిపారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, చత్తీస్ గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ షెడ్యూల్ కూడా వెలువరించారు.

 

 

 

Similar News