ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ లుక్ చూశారా?

Update: 2018-10-19 04:04 GMT

ఎన్టీఆర్ బయోపిక్ పాత్రలు ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో కీలక పాత్రలకు సంబంధించిన ‘లుక్స్’ అన్నీ ఇప్పటికే బయటకు వచ్చాయి. తాజాగా హరికృష్ణ కు సంబంధించిన లుక్ కూడా వచ్చేసింది. ఈ పాత్రను హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ హరికృష్ణ లుక్ ను విడుదల చేశారు. బాలకృష్ణ ఠీవిగా కూర్చుని వుండగా కళ్యాణ్‌రామ్‌ ఆయన పక్కన వంగి ఉన్నట్టుగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో అభిమానులకు కనువిందు చేస్తోంది.

‘విజయం మీది.. విజయరథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ’ అంటూ డైలాగ్‌ కూడా ఫోటోకు జతచేశారు. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా గా రానుంది. విద్యాబాలన్‌, దగ్గుబాటి రానా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు జనవరి 24న విడుదల కానున్నాయి.

 

 

Similar News