దీపావళి తర్వాత పెరగనున్న పత్రికల ధరలు!

Update: 2018-10-31 04:35 GMT

వారంలో రోజు రూ 6.50, సండే మాత్రం 8 రూపాయలు

నవంబర్ నెలలో పత్రికల ధరలు పెరగనున్నాయి. దీపావళి తర్వాత ఈ పెరుగుదల ఎప్పుడైనా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు రూపాయలు ఉన్న పత్రికల ధర 6.50 రూపాయలకు పెరగనుంది. అదే ఆదివారం రోజు అయితే రేటు 8 రూపాయలుగా నిర్ణయించినట్లు సమాచారం. న్యూస్ ఫ్రింట్ ధర గణనీయంగా పెరగటం, ఇంక్ ల ధరల పెరుగుదల కూడా పత్రికల నిర్వహణ భారాన్ని పెంచాయి. అయితే పత్రికల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుల కంటే ప్రకటనల ఆదాయమే ఆయా సంస్థలకు ప్రధాన వనరు. కొన్ని యాజమాన్యాలు అయితే పత్రికలను అడ్డం పెట్టుకుని చేసుకునే పనులకు ‘భారీ ఆదాయం’ అందుతుంది. ఇక ఎన్నికల సీజన్లో అయితే అది లెక్కే ఉండదు. ఒకప్పుడు పూర్తి నిబద్ధతతో ఫనిచేసిన పత్రికా యాజామాన్యాలు ఉండేవి. తర్వాత తర్వాత అవి దారితప్పుతూ వచ్చాయి.

పత్రికలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాల దగ్గర భారీ ఎత్తున కాంట్రాక్ట్ లు దక్కించుకోవటం..ఇతర పనులు చేయించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు కొంత మంది అధినేతలు. అయితే ఇది పత్రికాదాయం కిందకు రాదు. యాజమాని ఆదాయంలోకి వెళుతుంది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే..పత్రికలపై వచ్చే ఆదాయానికి..వాటి నిర్వహణకు మధ్య తేడా భారీగానే ఉంటుంది. ఏదో కొంత మందికి లాభాలు వస్తాయి తప్ప..చాలా మంది పరిస్థితి గగనమే. సర్కులేషన్ తక్కువ ఉన్న పత్రికలకు పెద్ద ప్రమాదమేమీ ఉండదు. ఎక్కువ సర్కులేషన్ ఉన్న వారికే చిక్కులు అన్నీ. న్యూస్ ప్రింట్ ధరలు భవిష్యత్ లో కూడా మరింత పెరిగే అవకాశం ఉండటంతో అగ్రశ్రేణి పత్రికలు అన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫాంలపైనే ఫోకస్ పెడుతున్నాయి. భవిష్యత్ లో పేజీల సంఖ్య మరింత తగ్గటంతో పాటు..ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే భవిష్య త్ లో పత్రికల రేట్లు మరింత పెరగటం ఖాయంగా కన్పిస్తోంది.

Similar News