నారా లోకేష్ కు రూల్స్ వర్తించవా!

Update: 2018-10-14 05:22 GMT

నారా లోకేష్. బాధ్యత గల మంత్రి. తనకు తాను యూత్ ఐకాన్ గా ఊహించుకుంటారు. మరి ఆయన గురించి యూత్ ఏమనుకుంటారో మాత్రం ఎవరికీ తెలియదు. అందుకే తనకు సంబంధం లేకపోయినా ‘నిరుద్యోగ భృతి’ విషయంలో ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను పక్కకు నెట్టి మరీ విధాన నిర్ణయాలు అన్నీ ఆయనే ప్రకటించేశారు. చివరకు యాడ్స్ లో కూడా మంత్రి కంటే ముందే తన ఫోటో వేయించుకున్నారు. తాజాగా నారా లోకేష్ తుఫాను తాకిడితో అల్లకల్లోలం అయిన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ సమయంలో ఆయన బైక్ రైడ్ చేశారు. అది కూడా హెల్మెట్ లేకుండా. రాష్ట్రంలో ఎవరైనా టూ వీలర్ డ్రైవింగ్ చేస్తే విధిగా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన ఉంది.

ఉల్లంఘించిన వారికి జరిమానా కూడా విధిస్తారు. అదీ తుఫాన్ తో ఓ పక్క చెట్లు అన్ని విరిగిన పడిన ప్రాంతంలో బైక్ పై పర్యటిస్తూ...తనతో పాటు పక్కన పదుల సంఖ్యలో హెల్మెట్ లేకుండా బండ్లు నడిపిన వారిని ఈ చిత్రంలో చూడొచ్చు. అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన మంత్రే ఇలా నిబంధనలు ఉల్లంఘించటం ఏమిటి? అని రవాణా శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో అసలు రూల్స్ అన్నవే పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారు. పాలనలోనే కాదు..ఇలా రహదారులపై కూడా అంతా ‘మా ఇష్టం’ అన్నట్లే సాగుతోంది.

Similar News