నీరు-ప్రగతిలో సీబీఐ ఓ భాగమా?

Update: 2018-10-29 07:05 GMT

ప్రతి రోజూ మీడియాను ఎలా వాడుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. నిత్యం తాను చెప్పాలనుకున్నది ఏదో ఒక రూపంలో బయటకు పంపటం ఆయన ప్లాన్. ఆయన నిర్వహించే టెలికాన్ఫరెన్స్ సబ్జెక్ట్ కు అందులో మాట్లాడే మాటలకు సంబంధం ఉండదు. అసలు చంద్రబాబు లక్ష్యం కూడా అసలు సబ్జెక్ట్ కాదు. తన మాటలు..ఉదయం నుంచి టీవీల్లో నడవాలి..పత్రికల్లో రావాలి. అదే ఆయన టార్గెట్. గత కొంత కాలంగా ఇదే సాగుతోంది. అందులో భాగంగానే సోమవారం ఉదయం కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సబ్జెట్ నీరు-ప్రగతి పురోగతి అంట. మాట్లాడింది ఏంటో మీరే ఓ సారి చూడండి. ‘రాజకీయం, పరిపాలన రెండూ ముడిపడివుంటాయి. మంచి జరుగుతుందనే ఎన్డీఏలో చేరాం. కానీ మంచి జరగలేదు కాబట్టే బైటకు వచ్చాం. ప్రత్యర్ధులను కట్టడి చేయడానికి వ్యవస్థలను వాడుకోవడం సరైందికాదు.ఎన్డీఏలో ఉన్నంతకాలం మనపై ఐటి దాడులు లేవు.బైటకొచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయి.సిబిఐలో పరిణామాలు దేశానికి అప్రదిష్ట తెచ్చాయి.

కేంద్రం ఇబ్బందులు పెట్టి డిమోరలైజ్ చేయాలని చూసింది.ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేతపై దాడిపై దుష్ప్రచారం. ఆయన అభిమాని చేసిన దాడికి రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు.తెలుగుదేశం పార్టీకి దాడిని అంటకడుతున్నారు. రాష్ట్రంలో వర్ష పాతం లోటు ఉంది. నవంబర్ 1నుంచి ఈశాన్య రుతు పవనాల ప్రభావం అధికం. నెల్లూరు , కడప జిల్లాలలో 6వ తేది వరకు వర్షాలు పడే అవకాశం ఉంది.295 కరవు మండలాల్లో మరో 3.5కోట్ల పనిదినాలు వస్తాయి.మనం చేసేది సక్రమం అయినప్పుడు ఎవరికీ భయపడాల్సింది లేదు. చివరి రెండు లైన్లు తప్ప మిగతా అంతా రాజకీయమే. మరి దీనికి నీరు-ప్రగతి టెలికాన్ఫరెన్స్ అని పేరు పెట్టడం దేనికో?.

 

Similar News