ఆర్ ఎక్స్ 100 దర్శకుడికి బహుమతి

Update: 2018-08-11 13:23 GMT

ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై...సంచలన విజయం దక్కించుకున్న సినిమా ‘ఆర్ ఎక్స్ 100’. విడుదలకు ముందే ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి అంతే కాన్ఫిడెంట్ గా సినిమా సక్సెస్ పై ధీమాతో ఉన్నారు. ఆయన ధీమా నిజమే అని నిరూపించింది సినిమా సక్సెస్. బోల్డ్ కంటెంట్‌ తో తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 మంచి విజయం సాధించటమే కాదు నిర్మాతకు కాసుల పంట పండించింది. అందుకే తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడికి నిర్మాత అశోక్‌ గుమ్మకొండ ఓ ఖరీదైన కారు బహుమతి ఇచ్చారు. అజయ్‌ భూపతికి జీప్ కంపెనీ కారును అందించారు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లు హీరో హీరోయిన్లుగా ఆర్‌ఎక్స్‌ 100 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Similar News