గనుల అక్రమాలపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

Update: 2018-08-19 05:20 GMT

తెలుగుదేశం ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గనుల దోపిడీ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో సీబీసీఐడి విచారణ అంటే కేసును పక్కదారి పట్టించటమే అని జగన్ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు సమయంలోనే చంద్రబాబు స్వయంగా బహిరంగ వేదికలపై తనకూ సీఐడీ ఉందని..ఏసీబీ ఉందని మాట్లాడారని..అలాంటి సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ ఎలా చేస్తాయని ప్రశ్నించారు. గనుల అక్రమాలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? అని ఆయన ట్విట్టర్ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు. అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత‍్నం చేస్తున్నారన్నారు.

శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేసినట్లు తేలుతోందన‍్నారు. ‘ప్రతీరోజూ కొన్ని వేల లారీలను ఉపయోగించి ఖనిజాన్ని తరలించేశారు. ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవ‍్వరికీ తెలియదని అనుకోవాలా?. ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీల్లో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా?. రాష్ట్రంలో జరుగుతున్న ఏ సహజ వనరులను మిగల్చలేదు అరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐ లాంటి ఏజెన్సీతో గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే నిజా నిజాలు బయటకు వస్తాయిని, ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు బయటకు వస్తాయన్నారు.

 

Similar News