ఏపీ ‘కాల్ సెంటర్’లోనూ కోట్ల రూపాయల స్కామ్!

Update: 2018-08-06 10:10 GMT

కోట్లాది రూపాయలు కొట్టేయటానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. చివరకు మొక్కల్లో కూడా భారీ స్కామ్ చేస్తున్నారు. వాటికి ‘గ్లోబల్’ ట్యాగ్ లు తగలించి దోచుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు దక్కాల్సిన వేతనాలను పూర్తిగా వారికి చెల్లించకుండా..మధ్యలోనే కొంత మంది బడాబాబులు కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. సింగిల్ టెండర్ వచ్చినా కార్వేకు చెందిన సంస్థకే సర్కారు కాల్ సెంటర్ నిర్వహణ బాధ్యతను అప్పగించింది. ఈ టెండర్ గడువు ముగిసిన తర్వాత కూడా అదే సంస్థకు..టెండర్ ను అలా కొనసాగించేశారు. నిబంధనల కు ఇది విరుద్ధం. టెండర్ ఎప్పటికి పూర్తవుతుందో అధికారులకు తెలుసు కాబట్టి ముందే మేల్కొని టెండర్ పిలిచి. ఎవరు తక్కువ రేటు సర్వీసులు అందించటానికి ముందుకొస్తారో వారికే పని అప్పగించాలి.

కానీ కార్వే విషయంలో సర్కారు నిబంధనలు ఏమీ పాటించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాల్ సెంటర్ లో పనిచేసేందుకు సంస్థ కోట్ చేసిన మొత్తం..వాస్తవంగా వారికి చెల్లిస్తున్న మొత్తం మధ్య చాలా వ్యత్యాసం ఉందని..ఉద్యోగుల సంఖ్యలో కూడా భారీ ఎత్తున గోల్ మాల్ జరుగుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఏటా ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని..అందుకే సర్కారు కూడా ఈ విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తుందని చెబుతున్నారు. ఓ వైపు ఏపీ కష్టాల్లో ఉంది అంటూనే..దోచుకోవటం మాత్రం చాలా సులభంగా దోచేసుకుంటున్నారు.

 

Similar News