అరవింద సమేత రాఘవ టీజర్ వచ్చేసింది

Update: 2018-08-15 03:54 GMT

‘కంట పడ్డావా..కనికరిస్తానేమో. ఎంటబడ్డానా నరికేస్తా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ తో అరవింద సమేత రాఘవ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటంతో హీరోతో అదే యాసలో డైలాగులు చెప్పించారు. టీజర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్ కత్తితో ‘ఊచకోత’కు రెడీ అయినట్లు పరుగులు బెడతాడు. గాల్లోకి ఎగిరే కుర్చీని పట్టుకుని ..అందులో ఎన్టీఆర్ కూర్చునే సీన్లు టీజర్ లో హైలెట్ గా నిలుస్తాయి.

ఓన్లీ ఎన్టీఆర్ ఫైటింగ్ సీన్లే ఇందులో కన్పిస్తాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ముందు ప్రకటించినట్లుగానే దసరాకు విడుదల కానుంది. టీజర్ స్టార్టింగ్ లో ఓ కత్తి గాల్లో తిరిగే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ విడుదలైన నిమిషాల్లోనే వ్యూస్ లక్షల్లో చేరింది.

https://www.youtube.com/watch?v=MIBAkM2IbhI

 

 

 

Similar News