‘సెంచరీ’కొట్టిన జగన్

Update: 2018-07-28 08:36 GMT

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ‘సెంచరీ’ కొట్టారు. సెంచరీ ఏంటి అనుకుంటున్నారా?. పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి శనివారంతో వంద నియోజకవర్గాల్లో తన యాత్ర పూర్తి చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్న జగన్..తన పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకోవటంతోపాటు..ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నారు. శనివారం నాడు జగన్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి ప్రవేశించారు. జగ్గంపేటలో పాదయాత్ర ప్రవేశించడంతో 100 నియోజక వర్గాలు పూర్తయ్యాయి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవంబర్‌6, 2017న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

222 రోజుల్లో ప్రజాసంకల్పయాత్ర 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే జగన్ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వైఎస్‌ జగన్‌కు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.

 

 

Similar News