పవన్ కళ్యాణే విడాకులు అడిగారు

Update: 2018-07-07 07:43 GMT

ఈ సంచలన విషయం బయటపెట్టింది ఎవరో తెలుసా?. రేణూ దేశాయ్. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని..కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఆమె ఈ విషయాన్ని తొలిసారి బహిర్గతం చేశారు. గతంలో పలు ఇంటర్వూల్లో విడాకుల అంశం ప్రస్తావనకు వచ్చినా రేణూ దేశాయ్ ఈ అంశాన్ని సున్నితంగా తిరస్కరించేవారు. కానీ కారణాలేంటో తెలియదు కానీ..విడాకులు అడిగింది పవన్ కళ్యాణే అని స్పష్టం చేశారు. రేణూ దేశాయ్ తన పర్సనల్‌ యుట్యూబ్‌ చానల్‌లో రిలీజ్‌ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్ట నష్టాలతో పాటు పవన్‌తో విడాకులకు కారణమైన పరిణామాలపై పలు అంశాలను స్పష్టం చేశారు.

ముందు పవన్‌ కళ్యాణే విడాకులు కావాలన్నారని, అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు. అయితే ఇన్నేళ్లు ఇంటి విషయాన్ని బయటపెట్టి గోల చేయకూడదన్న ఉద్దేశంతోనే స్పందించలేదన్న రేణూధేశాయ్ ఇప్పుడు మరో ఇంటికి కోడలిగా వెళుతున్న తరుణంలో ప్రజలకు, అభిమానులకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నానన్నారు. మరి ఈ విషయంపై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

 

 

Similar News