పది కోట్ల యువతకు కష్టాలే!

Update: 2018-06-18 10:55 GMT

యూత్. ఆ సౌండ్ లోనే ఓ వైబ్రేషన్. ఏ పని అప్పగించినా పరుగులు పెడుతూ చేస్తారు. అందుకే చాలా చోట్ల యూత్ కు ఛాన్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం వేరు. అదే యూత్ ప్రస్తుత స్పీడ్ యుగానికి అనుగుణంగా నైపుణ్యాలను సాధించటంలో విఫలమవుతోంది. అందుకే అగ్రాసనాలను అందుకోవాల్సిన వారు...అరకొర వేతనాలతో సరిపుచ్చుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వారి సంఖ్యా అలా ఇలా కాదు..ఏకంగా పది కోట్ల వరకూ ఉంటుందని ఇన్పోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్ దాస్ పాయ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. దేశంలో 21 నుంచి 35 ఏళ్ల మధ్యన ఉన్న పదికోట్ల మంది యువత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకు దీటుగా మెరుగైన నైపుణ్యాలను సంతరించుకోవటంలేదని మోహన్‌దాస్‌ పాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

2025 నాటికి భారత్‌లో మరో పది కోట్ల మంది నాణ్యత లేని మానవ వనరులు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని, దీంతో 21 నుంచి 45 ఏళ్ల వయసుగల ఉద్యోగుల్లో తక్కువ నాణ్యత, దిగువ స్థాయి విద్యార్హతలతో ఉన్న సిబ్బంది సంఖ్య 20 కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యా సంస్కరణల ఫలితాలు అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టినా పదేళ్లకు వాటి ఫలాలు అందివస్తాయని ఫలితంగా ఒక తరం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నారు.

Similar News