చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికేషన్

Update: 2018-04-04 13:04 GMT

పరిశ్రమలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కావాలంటే కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అవి తనిఖీ చేసిన తర్వాతే ఎంపిక చేసిన సంస్థలు ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ జారీ చేస్తాయి. ఐటి కంపెనీలకూ ఇదే తరహా పద్దతి ఉంటుంది. వాటికి ఇదే పద్దతి ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాతే సర్టిఫికేషన్ ఇస్తారు. కానీ దేశంలో ఎక్కడాలేని రీతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ‘స్వయంప్రకటిత నిప్పు’గా మారిపోయారు. అంతే కాదు...ఢిల్లీ వేదికగా కూడా ఆయన తనకు తానే సర్టిఫికేషన్ ఇచ్చేసుకున్నారు. అదేంటి అంటే ఆయన ‘ క్లీన్...హానెస్ట్’ అట. ఓ వైపు చంద్రబాబునాయుడిపై గతంలో ఎన్నడూలేని రీతిలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తుంటే తనంతట తాను క్లీన్..హానెస్ట్ అని ప్రకటించటంతో అవాక్కు అవటం జాతీయ మీడియా వంతు అయింది.

ఇదంతా తెలుగు మీడియాకు అలవాటే. చాలా మంది చంద్రబాబును నిజమైన నిప్పుగా ప్రొజెక్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంటారు కూడా. కానీ ఢిల్లీ వేదికగా కూడా ఆయన తన నిజాయతీకి సంబంధించి స్వయంగా ఓ ఐఎస్ఐ ముద్రలాగే తానే సొంతంగా సర్టిఫికెట్ ఇచ్చేసుకుని శభాష్..శభాష్ అన్న రీతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించేశారు. పట్టిసీమ మొదలుకుని పోలవరం, అమరావతి, పరిశ్రమలు..ఐటి, ఫైబర్ గ్రిడ్, విద్యుత్ రంగాల్లో అవినీతి రాజ్యమేలుతోందని..దీనికంతటికీ ప్రధాన కారణం చంద్రబాబునాయుడే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దశలో కూడా చంద్రబాబు తనకు తాను స్వయంప్రకటిత ‘నిప్పు’గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

Similar News