‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబుపై పవన్ పంచ్

Update: 2018-03-03 13:13 GMT

థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. ఇది పృధ్వీ ఓ సినిమాలో చెపితే పేలిన డైలాగ్ ఇది. కానీ ఏపీలో గత కొన్ని రోజులుగా ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇక్కడ అంటూ చంద్రబాబు ఊదరగొడుతున్నారు. కానీ నిన్న మొన్నటివరకూ చంద్రబాబుపై పెద్ద విమర్శలు చేయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబు పరువు తీసేశారు. ఎంతో పరిపాలనా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబే ఇంత గందరగోళంలో ఎందుకున్నారు?. ‘ప్రత్యేక హోదా..ప్యాకేజీల విషయంలో క్లారిటీ రావటానికి మీకు నాలుగేళ్ళు ఎందుకు పట్టింది. పరిపాలనా అనుభవం ఉన్న మీరే ఇంత గందరగోళంగా వ్యవహరిస్తే ఇక ప్రజలకు న్యాయం ఎలా జరుగతుంది. చంద్రబాబు ఓ సారి ప్రత్యేక హోదా కావాలన్నారు. ఇంకో సారి ప్రత్యేక ప్యాకేజీ చాలన్నారు. పాచిపోయిన లడ్డూలైనా పర్వాలేదన్నారు. ఇప్పుడు మళ్ళీ హోదా కావాలని అడుగుతున్నారు. ఇంత పరస్పర విరుద్ధ ప్రకటనలెందుకు?. ప్రజలకు మీరు ఏమి చేయాలో అది చేయరు. ప్రజల్లో గందరగోళం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు’ అంటూ సూటిగా స్పష్టంగా చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

హోదా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అని..రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుని తప్పు చేసిందని అన్నారు. పోలవరం లో జరిగే జాప్యానికి ఇప్పుడు ఏపీ సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. అనుభవం ఉన్న నేతగా తాను చంద్రబాబుకు మద్దతు ఇస్తే..ఇప్పుడు అందరూ తనను నిలదీస్తున్నారని...అందుకే నైతిక బాధ్యత గా జెఎఫ్ సీతో వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినప్పుడు తాను కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఈ ప్రయోజనం దక్కుతుందని భావించినట్లు పవన్ తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ లో ఉన్న సంస్థల విభజన కూడా ఇంకా సరిగా పూర్తికాలేదని తెలిపారు. గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఎవరిపై పరుషమైన వ్యాఖ్యలు చేయకపోయినా...సూటిగా స్పష్టంగా మాట్లాడారు.

 

 

Similar News