చంద్రబాబును వీడని మోడీ భయం

Update: 2018-03-13 09:33 GMT

తెలుగుదేశం అధినేత, ఆంధ్ర్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఇంకా ప్రధాని నరేంద్రమోడీ భయం వీడలేదా?. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. ఆర్థిక నేరస్థులు ప్రధానిని కలవటం ఎక్కడైనా ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కలిసే వాళ్ళు ఎవరినైనా కలుస్తారు. కలిసిన వాళ్ళను అడగాల్సిన ప్రశ్న..కలిసేవాళ్ళను అడగటం ద్వారా చంద్రబాబు తన భయాన్ని బయటపెట్టుకున్నట్లు అయింది. అయినా ప్రధాని మోడీ ఎవరినీ కలవాలి..ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వాలి అన్నది చంద్రబాబు నిర్ణయిస్తారా?. ఇదే చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ సూపర్ అని తీర్మానం చేశారు. తాను ఎవరికీ భయపడనని..రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్యాకేజీకి అంగీకరించామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

అది కాస్తా రివర్స్ కావటం ఇప్పుడు అసెంబ్లీలో మరో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పునర్విభజన చట్టం, హామీల అమలుపై అసెంబ్లీలో మరో తీర్మానం చేయనున్నట్లుఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ప్రకటించారు. మరి గతంలో ప్యాకేజీని స్వాగతిస్తూ చేసిన తీర్మానం సంగతేంటి?. బిజెపి నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ ను వ్యతిరేకిస్తారు. రాయలసీమ నుంచి నేను ఉండగా..ఇంకా ఏమి కావాలి అంటూ ప్రకటిస్తారు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా? అని మండిపడతారు. మరి ఇదే చంద్రబాబు వేర్పాటువేద నేత తరహాలో దక్షిణాది..ఉత్తరాది అంటూ కొత్త చిచ్చు రాజేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు డ్రామాలు ఎన్నో.

 

Similar News