అక్కినేని అఖిల్. చాలా మంది హీరోల కంటే అభినయంలో ఎక్కడా లోపం లేకపోయినా సరైన కథలు దొరక్క బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బందిపడుతున్న హీరో. చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో సరైన హిట్ కోసం తపించాల్సి వస్తోంది. హలో సినిమా హిట్ అని ప్రచారం జరిగినా అది కూడా పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందించటంలో విఫలమైంది. ఉగాది సందర్భంగా అఖిల్ తన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటించేశాడు.
తన తొలి చిత్రం తొలిప్రేమతో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో మూడో ప్రాజెక్టు అన్న విషయాన్ని అఖిల్ చెప్పేశాడు. తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర.. అఖిల్-వెంకీ చిత్రాన్నీ నిర్మించబోతోంది. నటీనటులు, పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాణ సంస్థ తన ట్వీట్లో తెలియజేసింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.