అమెరికా ఆస్పత్రిలో విశాల్

Update: 2018-02-26 06:09 GMT

తమిళ 'సినీ పరిశ్రమకు సంబంధించి కలకలం. యువ హీరో విశాల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అదీ కూడా అమెరికాలో. తలనొప్పి, కీళ్లనొప్పులతో బాధపడుతున్న నటుడు విశాల్‌ చికిత్సల కోసం అమెరికా ఆస్పత్రిలో చేరారని చెబుతున్నా..ఇంత చిన్న సమస్యలపై అంత వరకూ వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? అన్న చర్చ సాగుతోంది. బయటకు తెలియని సమస్య ఏదై అయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. విశాల్ నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాతల సంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం విశాల్‌ ఇరుంబుతిరై, సండైకోళి–2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈయన గత కొం తకాలంగా తలనొప్పితో బాధపడుతూ వచ్చారు. అవన్‌ ఇవన్‌ చిత్రంలో నటించినప్పటి నుంచి తలనొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. తుప్పరివాలన్‌ చిత్రంలో నటిస్తుండగా ఒక ఫైట్‌ సన్నివేశంలో భుజానికి గాయం ఏర్పడింది. దీంతో తలనొప్పి అధికమైంది. ఈ నేపథ్యంలో గత వారం ఢిల్లీ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజి యోథెరపీ చికిత్సలు అందుకున్నారు. అయినప్పటికీ కీళ్లనొప్పులు పోకపోవడంతో విశాల్‌ అమెరికా వెళ్లారు.విశాల్ కొద్ది రోజుల క్రితం జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు రెడీ అయ్యాయి. అయితే సాంకేతిక కారణాలతో నామినేషన్ తిరస్కరిచంటంతో ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

 

 

 

 

Similar News