టీడీపీపై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

Update: 2017-12-02 04:53 GMT

తెలుగుదేశం సర్కారుపై బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విమర్శలను తిప్పికొడుతూ ఆయన ఎదురుదాడికి దిగారు.  నిబంధనల ప్రకారం లేని టెండర్ ను మాత్రం కేంద్రం ఆపమని చెప్పిందని..పోలవరం ప్రాజెక్టును కాదని బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ తెలిపారు. ఆయన శనివారం నాడు వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ ల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారం 45 రోజులు ఉండాల్సిన టెండర్ సమయాన్ని 18 రోజులే ఎందుకు ఉంచారు. కొత్తగా పిలిచిన టెండర్ లో  రోజుల్ వ్యవధిలోనే  వ్యయం 88 కోట్ల రూపాయలు ఎందుకు పెరిగిందని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. అంతా హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చిందని అన్నారు.

                                       ఏపీ ప్రభుత్వం ఈ టెండర్లపై అనవసరం రాద్దాంతం చేస్తుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ఆపమని కేంద్రం లేఖలో ఎక్కడాలేదని...టెండర్లలో ఉన్న తప్పుల ఆదారంగా సాంకేతిక అంశాలతో  లేఖ రాస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. కొంత మంది నేతలు తమ సొంత డబ్బుతో పోలవరం కడతామని ప్రకటిస్తున్నారని..ఆ అవసరం లేదని..వాళ్ళు ప్రజల  ఆస్తులు కాజేయకుండా ఉంటే చాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిబంధనల ప్రకారం పోలవరం ప్రాజెక్టు కట్టితీరుతుందని అన్నారు.

 

 

 

 

Similar News