బిజెపిని ఏమీ అనొద్దు

Update: 2017-12-19 05:31 GMT

గుజరాత్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఏపీ బిజెఫి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అవినీతి చేస్తున్నారో..ఎవరు అవినీతిరహిత పాలన అందిస్తున్నారో అందరూ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పరిపాలన వదిలేసి ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు అని టీడీపీ పేరు పెట్టకుండానే వీర్రాజు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తాము సీట్లు అడిగి తీసుకునే పరిస్థితిలో ఉండమని...డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉంటామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ వెంటనే స్పందించారు. సోము వీర్రాజు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారని..ఆయనపై చంద్రబాబు పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

కానీ సీన్ కట్ చేస్తే బిజెపిపై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు మీడియాకు లీకులు అందాయి. పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేయడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు.

 

Similar News