ఎన్నికల గురించి ఇప్పుడే టెన్షన్ వద్దు

Update: 2017-11-02 13:40 GMT

తెలంగాణ తెలుగుదేశం నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఎన్నికలప్పుడు ఏమి జరుగుతుందో అని ఇప్పుడే టెన్షన్ పడాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. కార్యకర్తల్లో ధైర్యం నింపటానికే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. గురువారం నాడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన టీ టీడీపీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన సమావేశంలో మాట్లాడారు.  రాజకీయాల్ల సమస్యలు..ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని..నెలకోసారి సమీక్షలు చేద్దామని..తాను కూడా ఇందులో పాల్గొంటానని ప్రకటించారు.

                               తెలుగుదేశం పార్టీ అదికారం కోసం రాలేదని ఆయన అన్నారు. ఒక నాయకుడు అటు,ఇటూ అయినా పార్టీకి ఎదురు లేదని వ్యాఖ్యానించారు.కార్యకర్తలు పార్టీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారని, కొందరు నేతలు ఏమి ఆలోచించినా, కార్యకర్తలు మాత్రం నిలబడ్డారని ఆయన అన్నారు. తనకు  కుటుంబం కన్నా తెలుగుదేశం కార్యకర్తల కుటుంబం అంటేనే ఇష్టమన్నారు. అదికారం ఉన్నా, లేకపోయినా టిడిపి కార్యకర్తలు పోరాడాలని కోరారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లు అని చెప్పిన నేత ఎన్.టి.ఆర్.అని ,ఆయన సందేశంతోనే ముందుకు వెళుతున్నామని అన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీగా తయారైందంటే తాను చేసిన అభివృద్దేనని పేర్కొన్నారు.

Similar News