లిస్టింగ్ లోనే జొమాటో షేర్లు అదరగొట్టాయి. ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరి సంస్థ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఆఫర్ ధర కంటే 30 శాతం ప్రీమియంతో 106 రూపాయల వద్ద నమోదు అయింది బీఎస్ఈలో. ఆ తర్వాత కొద్దిసేపటికే 115 రూపాయలకు పెరిగింది. నమోదు అయిన అరగంటలోనే ఏకంగా 42లక్షల షేర్లు చేతులు మారాయి. జొమాటో షేర్లు ప్రకటించిన దాని కంటే నాలుగు రోజుల ముందే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.
కంపెనీ షేరు ధరను 76 రూపాయలుగా నిర్ణయించింది. ఈ సంస్థ ఇన్వెస్టర్ల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు పైనే సమీకరించింది. జొమాటో షేర్లు మంచి ప్రీమియంతో నమోదు అయినా కూడా మదుపర్లు సెకండరీ మార్కెట్లో కొనుగోలుకు పెద్ద ఎత్తున ఆసక్తిచూపిస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి కోటి షేర్ల కుపైనే కొనుగోలుకు బయ్యర్లు ఉన్నారు.