ఆ మూడు షరతులను అంగీకరిస్తారా!

Update: 2026-03-12 09:15 GMT

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో తమ యుద్ధం దాదాపు ముగిసింది అని...ఇక తాను ఎప్పుడు అంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది అని చెపుతున్నారు. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూ లో కూడా అదే చెప్పారు. ఇరాన్ లో తమ టార్గెట్ లు పూర్తి అయ్యాయి అని...అనుకున్న పనిని ఎంతో ముందే పూర్తి చేశామన్నారు. అయితే యుద్ధం ముగింపు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చెపుతున్న అంత ఈజీగా ఆగేలా లేదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం ముగింపు అమెరికా చేతిలో కాదు...ఇరాన్ చేతిలో ఉంది అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్ లు సంయుక్తంగా చేసిన దాడిలో భారీగా నష్టపోయినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న అమెరికా బేస్ లు...అమెరికా కంపెనీలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు అమెరికా దిగ్గజ ఐటి కంపెనీలకు కూడా వార్నింగ్ లు ఇస్తుండంతో ఇరాన్ అమెరికా విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు కనిపిస్తోంది.

                                       మరో వైపు ఇరాక్ జలాల్లో ఉన్న అమెరికా నౌకపై సూసైడ్ బోట్ తో దాడి చేస్తే ఆ బోట్ మంటల్లో కాలిపోయింది. ఇందులోని సిబ్బందిని మాత్రం కాపాడారు. హర్ముజ్ జలసంధిలో నౌకలు వెళితే వాటిని తగలబెడతామని ఇరాన్ కొద్దిరోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గం విషయంలో ఇరాన్ కఠినంగా ఉండటంతో ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తమ ఆయిల్ రిజర్వులను బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు అమెరికా తో పాటు పలు దేశాలపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ తరుణంలో యుద్ధం ముగింపునకు సంబంధించి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తాజాగా వెల్లడించిన షరతులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

                                       Full Viewఅందులో అత్యంత కీలకమైనది ఇరాన్ చట్టబద్దమైన హక్కులను గుర్తించాలి. నష్టపరిహారం చెల్లించాలి. భవిష్యత్ లో దురాక్రమణ జరగకుండా పక్కాగా అంతర్జాతీయ హామీలు ఉండాలి అని ఆయన ఎక్స్ లో మూడు షరతులతో కూడిన పోస్ట్ పెట్టారు. అప్పుడే తాము కూడా యుద్ధం ఆపటానికి సిద్ధం అన్నారు. పశ్చిమ ఆసియాలో శాంతికి ఇరాన్ కట్టుబడి ఉంది అని...చైనా, రష్యాలకు సైతం తాము ఇదే విషయం చెప్పామన్నారు. మరి ఈ డిమాండ్లను అమెరికా, ఇజ్రాయిల్ లు అంగీకరిస్తాయా లేదా అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ లపై ఒత్తిడి పెరిగేలా ఇరాన్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది అని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరాన్ హర్ముజ్ జలసంధి నుంచి భారతీయ పతకాలతో కూడిన నౌకల రవాణాకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Tags:    

Similar News

భారీ పతనం