దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని టాప్ టెన్ విమానాశ్రయాల జాబితాలో నిలిచింది. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసిఐ) ఈ జాబితా సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రపంచంలోని బిజీ విమానాశ్రయాల్లో ఢిల్లీ కి కూడా చోటు దక్కింది. ఇందులో మొదటి స్థానం అమెరికాకు చెందిన అట్లాంటా జీఏ విమానాశ్రయం ఉండగా...రెండవ ప్లేస్ లో అమెరికాకే చెందిన డల్లాస్ ఎయిర్ పోర్ట్, మూడవ ప్లేస్ లో డెన్వర్, నాల్గవ ప్లేస్ లో చికాగో విమానాశ్రయం ఉన్నాయి. ఐదవ ప్లేస్ లో దుబాయ్ ఎయిర్ పోర్ట్ నిలిచింది. ఆరవ ప్లేస్ లో లాస్ ఏంజల్స్, ఏడవ స్థానంలో ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్, ఎనిమిది లో లండన్ హీత్రో ఎయిర్ పోర్ట్, తొమ్మిదిలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, పడవ ప్లేస్ లో పారిస్ ఎయిర్ పోర్ట్ ఉన్నాయి.
ఇవి అన్ని కూడా 2022 సంవత్సరానికి సంబందించిన లెక్కల ప్రకారం సిద్ధం చేసిన జాబితా. గత ఇది తో పోలిస్తే 2022 లో ఢిల్లీ లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల ట్రాఫిక్ 60 శాతం మేర పెరిగినట్లు ఏసిఐ వెల్లడించింది. ఇక్కడ నుంచి మొత్తం 59 . 5 మిలియన్ ల మంది ప్రయాణికులు రాక పోకలు సాగించారు. ఆగ్నేయ ఆసియా నుంచి ఈ జాబితాలో అంటే టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న ఏకైక విమానాశ్రయం ఇది ఒక్కటే కావటం విశేషం. 2022 సంవత్సరం లో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య 7 బిల్లియన్లకు చేరినట్లు తెలిపారు. అయితే గత ఏడాది లెక్కలు చూస్తే ట్రాఫిక్ గణనీయంగా పెరిగినా కూడా...ఇంకా కరోనా ముందు నాటి పరిస్థితికి రావాల్సి ఉంది.