దుబాయ్ ..మరో కీలక ప్రాజెక్ట్

Update: 2024-09-09 10:47 GMT

Full Viewఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ అంటే దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు దుబాయిలోనే ప్రపంచంలో రెండవ ఎత్తైన భవనం కూడా రానుంది. అదే బుర్జ్ అజిజి. ఈ భవనం ద్వారా దుబాయ్ కొత్తగా ఎన్నో ప్రపంచ రికార్డు లు నెలకొల్పబోతోంది. 725 మీటర్ల ఎత్తులో ఈ భవనం రానుంది. 131 కిపైగా ఫ్లోర్స్ ఉండే ఈ టవర్ లో అమ్మకాలు 2025 ఫిబ్రవరి లో ప్రారంభం అవుతాయి. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద భవనం 2028 సంవత్సరానికి అందుబాటులోకి రానుంది. దుబాయిలో అత్యంత ప్రీమియం ఏరియా అయిన షేక్ జాయేద్ రోడ్ లోనే ఇది కొలువు తీరనుంది.

                                                       బుర్జ్ అజిజి లో సెవెన్ స్టార్ హోటల్ తో పాటు నివాస సముదాయాలు, అపార్ట్మెంట్స్, హాలిడే హోమ్స్ కూడా ఉంటాయి. బుర్జ్ అజిజి లో ఎన్నో ప్రపంచ రికార్డు లు ఉంటాయి అని నిర్వాహకులు వెల్లడించారు. లెవెల్ 11 లో ఉండే హోటల్ లాబీ ప్రపంచంలో ఎత్తైన హోటల్ లాబీ గా నిలవబోతుంది. అంతే కాదు 126 లెవెల్ లో ఉండే నైట్ క్లబ్ కూడా ప్రపంచంలోనే ఎత్తైన క్లబ్ గా నిలుస్తుంది. 130 వ ఫ్లోర్ లో అబ్సర్వేషన్ డెక్ ఏర్పాటు చేయనున్నారు. 122 వ అంతస్తులో ఏర్పాటు చేసే రెస్టారెంట్ కూడా ఒక రికార్డు గా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మన భారతీయ కరెన్సీ లో దగ్గర దగ్గర 14 వేల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దుబాయ్ పర్యాటక రంగానికి ఇది మరింత ఊపు తెస్తుంది అని భావిస్తున్నారు.

Tags:    

Similar News