ప్రపంచం అలసిపోవచ్చు..కానీ కరోనా అలసిపోలేదు

Update: 2020-11-10 06:18 GMT

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్ ట్రెడోస్ అథనోమ్ కరోనాపై సంచలన వ్యాఖ్యలుచేశారు. కరోనా వల్ల ప్రపంచం అలసిపోవచ్చు కానీ ..కరోనా మాత్రం అలసిపోలేదన్నారు. పేదరికానికి, ఆకలికి, వాతావరణ మార్పులు, అసమానతలకు కు వ్యాక్సిన్లు లేవని అన్నారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మనకంటే బలహీనులకు కూడా ఆహారం అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సైన్స్, పరిష్కారాలు, సంఘీభావం ఒక్కటే మన ఆశాకిరణాలు అని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఇంకా కరోనాపై పోరాటం చేయాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ గురించి ప్రస్తావిస్తూ ఈ మహమ్మారిపై అంతర్జాతీయంగా కలసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్ వో చైనాకు అనుకూలంగా పనిచేస్తుందని..తాము దీని నుంచి తప్పుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జో బైడెన్ మాత్రం ఈ నిర్ణయాన్ని మార్పు చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు అభినందనలు తెలిపారు. అమెరికా పరిపాలనా వ్యవస్థతో క లసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Tags:    

Similar News