భారత్ కు దిగ్గజ టెక్ సంస్థల సాయం

Update: 2021-04-26 06:07 GMT

కరోనా సంక్షోభంతో విలవిలలాడుతున్న భారత్ కు సాయం అందించేందుకు ప్రపంచంలోనే ప్రముఖ దిగ్గజ సంస్థలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ముందుకొచ్చాయి. ఈ మేరకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లు ప్రకటనలు చేశారు. వీరిద్దరూ కూడా భారత్ కు చెందిన వారే అన్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించామంటూ సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్‌ చేశారు. రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలోముఖ్యంగా తీవ్ర ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో దేశానికి సహాయం అందించనుట్టు ప్రకటించారు. సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం,ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతుతో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.

అలాగే ఈ సందర్బంగా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా స్పందించారు. భారతదేశంలో తీవ్రయవుతున్నకోవిడ్ సంక్షోభం చూసి తల్లడిల్లిపోతున్నట్టు చెప్పారు. గూగుల్‌ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత ప్రభుత్వానికి రూ.135 కోట్ల నిధులను, వైద్యసామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడంతోపాటు, క్లిష్టమైన సమాచారాన్ని అందించేందుకు సహాయ పడేలా నిధులను అందిస్తున్నామని సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

Tags:    

Similar News