మాంద్యం దిశ‌గా ప్ర‌పంచం..డ‌బ్ల్యూటీవో హెచ్చ‌రిక‌

Update: 2022-09-28 13:25 GMT

Full Viewప్ర‌స్తుతం అంద‌రి నోటా విన్పిస్తున్న మాట మాంద్యం..మాంద్యం. ఇప్పుడు ప్ర‌పంచ ఆర్ధిక సంస్థ (డ‌బ్ల్యూటీ వో) చీఫ్ నోజి ఒకోంజో ఇవెలా కూడా ప్ర‌పంచం అంతా మాంద్యం దిశ‌గా సాగుతున్న‌ట్లు క‌న్పిస్తోంద‌ని..ఈ సమ‌స్య‌ను అధిగ‌మించేందుకు వేగంగా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. మాంద్యం దిశ‌గా సాగుతున్నా కూడా రిక‌వ‌రి గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌గ్గించేందుకు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న సెంట్ర‌ల్ బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతూ పోతున్నాయ‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌పంచం అంతా మాంద్యం దిశ‌గా సాగే సూచ‌న‌లు ఉన్నట్లు ఇండికేట‌ర్స్ అన్నీ చూపిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. దీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచం వ్యాప్తంగా ఇంధ‌న ద‌ర‌ల‌తోపాటు ఆహార ధ‌ర‌లు కూడా పెరుగుతున్నాయ‌ని వెల్ల‌డించారు. ప్రపంచ బ్యాంకుతోపాటు ఐఎంఎఫ్ కూడా ఈ ఏడాది ప్ర‌పంచ వ‌ద్ధి రేటు అంచ‌నాల‌ను త‌గ్గించాయి. ఆహార భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం ముంచుకొచ్చే సూచ‌న‌లు ఉన్నాయ‌న్నారు. ఓ వైపు కోవిడ్ తెచ్చిన స‌మ‌స్య‌లు...మ‌రో వైపు వాతావ‌ర‌ణంలో అనూహ్య మార్పులు..ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌టం, ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం వంటి ఎన్నో స‌మ‌స్య‌లు ప్ర‌స్తుత ప‌రిస్థితికి కార‌ణంగా తెలిపారు.

Tags:    

Similar News