వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ లో రష్యా టాప్

Update: 2024-04-12 07:24 GMT

Full Viewనేరాలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల కాలంలో దొంగలు కూడా చాలా స్మార్ట్ గా దోపిడీలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు నిత్యం ఏవో ఒక లింక్ లు పంపుతూ అవి ఓపెన్ చేస్తే చాలు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే ఈ జాబితా లో భారత్ పదవ ర్యాంక్ లో ఉంది.

ప్రపంచంలో అత్యధిక సైబర్ నేరాలు జరిగే దేశాల్లో రష్యా నంబర్ వన్ ప్లేస్ లో ఉంటే..ఆ తర్వాత స్థానాల్లో వరసగా ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, నార్త్ కొరియా, యూకె, బ్రెజిల్ లు ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధకులు నిర్వహించిన స్టడీ లో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. వీళ్ళే వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ను సిద్ధం చేశారు. రష్యా , ఉక్రెయిన్ లు అత్యంత సాంకేతిక నైపుణం గల సైబర్ క్రైమ్ హబ్స్ గా ఉన్నట్లు ఈ నివేదిక లో పేర్కొన్నారు.

Tags:    

Similar News