పెన్సిల్ తో కూతురిని పొడిచిన తల్లి

Update: 2020-10-24 08:28 GMT

షాకింగ్ ఘటన. ఓ తల్లి పెన్సిల్ తోపలుమార్లు తన కూతురు వీపుపై పొడిచిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి కారణం తెలిస్తే మరింత షాక్ కు గురవుతారు. పన్నెండు సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయి ఆన్ లైన్ క్లాస్ లు వింటోంది. ఆ సమయంలో టీచర్ అడిగిన ప్రశ్నలకు తన కూతురు సరైన సమాధానాలు ఇవ్వలేదనే కోపంతో 35 సంవత్సరాల మహిళ పెన్సిల్ తో కూతురు వెనకబాగాన పలుమార్లు పొడిచింది.

ప్రశ్నలకుసమాధానం చెప్పలేదనే కోపంతో ఆ మహిళ ఈ దారుణానికి పూనుకుందని చెబుతున్నారు. ఈ వ్యవహారం అంతా చూసిన ఆ బాలిక చెల్లెలు వెంటనే బాలికల రక్షణకు ఉద్దేశించిన హెల్ప్ లైన్ 1098 కి ఫోన్ చేసింది. ఈ ఘటన ముంబయ్ లో తాజాగా జరిగింది. పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News